'దేవదాస్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి, హీరోయిన్గా ఓ రేంజ్లో స్టార్డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో కూడా అడుగు పెట్టి అక్కడా తన సత్తా చాటుతోంది. అయితే చాలాకాలంగా టాలీవుడ్లో ఇలియానా సందడి లేదు కానీ, ఆమెపై అప్పుడప్పుడూ హాట్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి.
బాలీవుడ్లో బిజీగానే సినిమాలు చేస్తోన్న ఈ బెల్లీ బ్యూటీ ఆస్ట్రేలియన్ కెమెరామేన్ ఆండ్రూ నీబోస్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం ఈ ముద్దుగుమ్మ డైరెక్ట్‌గా చెప్పలేదు కానీ, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ, 'మై హబ్బీ' అని ముద్దుగా సంబోధిస్తూ ఉంటుంది. ఆ రకంగానే ఇలియానాకి పెళ్లయ్యిందన్న విషయం గుర్తించారు ఆమె అభిమానులు. అయితే ఇప్పుడు మరో హాట్ న్యూస్ స్వైర విహారం చేస్తోంది ఇలియానా విషయంలో.
అదేంటంటే 'ఇలియానా తల్లి కాబోతోందట' అని. అయితే ఈ ముచ్చటైతే మాత్రం ఈ ముద్దుగుమ్మ నోటి నుండి వినాలన్న ఆశ అభిమానులకు తీరుతుందో లేదో చూడాలి మరి. ఇటీవల ఆండ్రూ, ఇలియానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, 'ఓ మధురమైన క్షణాన్ని ఇలియానా ఎంజాయ్ చేస్తోందని..' క్యాప్షన్ ఇవ్వడంతో అది ఇదే కాబోలు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే అది అవునా కాదా అనే విషయం ఎప్పటికి తెలుస్తుందో చూడాలి మరి. ఇటీవలే బాలీవుడ్లో ఇలియానా నటించిన 'రెయిడ్' చిత్రం మంచి విజయం అందుకుంది. అజయ్‌దేవగన్ ఈ సినిమాలో ఇలియానాకి జోడీగా నటించాడు.