'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో లవర్‌బోయ్‌గా మారిపోయాడు హీరో కార్తికేయ. తాజాగా 'హిప్పీ' చిత్రంతో రాబోతున్నాడు. 'ఆర్‌ఎక్స్ 100'కి ఏమాత్రం తీసిపోని విధంగా 'హిప్పీ' కథను ఎంచుకున్నాడీ యంగ్ హీరో. టి.ఎన్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కలైపులి.ఎస్.థాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 7న 'హిప్పీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
గమనించాల్సిందేంటంటే, ఇదే డేట్‌లో గతేడాది 'ఆర్‌ఎక్స్ 100' రిలీజైంది. సంచలనాలకు తెర లేపింది. ఆ సినిమా వచ్చి ఏడాది కావస్తున్నా, ఆ సినిమాలోని గ్లామర్, రొమాంటిక్ ఫ్లేవర్‌ని కుర్రకారు ఇంకా మర్చిపోలేదు. ఎప్పటికప్పుడే ఫ్రెష్‌గా చర్చించుకుంటూనే ఉంది. ఇకపోతే అదే డేట్‌కి రిలీజ్ కాబోతున్న 'హిప్పీ' ఎలాంటి సంచలనాలకు వేదికవుతుందో చూడాలిక. ఆల్రెడీ హిప్పీ సినిమా టీజర్‌కి 'ఆర్‌ఎక్స్ 100' రేంజ్‌లోనే రెస్పాన్స్ వచ్చింది.
ఇక అసలు సిసలు రిజల్ట్ విడుదల తర్వాత తేలిపోతుంది. 'హిప్పీ' విషయానికి వస్తే, ఈ సినిమాలో కొంచెం రియలిస్టిక్ స్టోరీ మిళితమై ఉందట. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్, యూత్ ఫుల్ కంటెన్ట్ పుష్కలంగా ఉన్నాయని ప్రచార చిత్రాలతో ప్రూవ్ చేసేశారు. దిగంగనా సూర్యవాన్షీ ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా నటిస్తోంది. సీనియర్ నటుడు జె.డి.చక్రవర్తి ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు.