నెగిటీవ్ టాక్‌నీ, ట్రోలింగ్‌నీ సమర్థవంతంగా దాటుకుని, వసూళ్ల పరంగా ముందడుగు వేస్తోంది సాహో. తొలి రోజు ఏకంగా 130 కోట్లతో షేక్ చేసిన సాహో.. రెండో రోజు మరో 70 కోట్లు తెచ్చుకుంది. మూడో రోజు కూడా సాహో దూకుడు తగ్గలేదు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు కలిపి 270 కోట్ల గ్రాస్ తెచ్చుకుంది. షేర్ రూపంలో లెక్క గడితే దాదాపు 140 కోట్ల వరకూ ఉండొచ్చు. నైజాంలో సాహో దుమ్ము దులుపుతోంది. తొలి రోజే.. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టింది సాహో. దాదాపు 8.5 కోట్లతో హడలెత్తించింది.
ప్రస్తుతం నైజాంలో రూ.20 కోట్లు వసూలు చేసింది.సోమవారం వినాయక చవితి సెలవు సాహోకి మరింత కలిసొస్తుంది. నాలుగురోజులకు కలిపి సాహో దాదాపు 320 కోట్లు వసూలు చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఈ జోరు ఇంకెన్ని రోజులు ఉంటుందో చూడాలి. శుక్ర, శనివారాలతో పోలిస్తే.. ఆది వారం సౌత్ ఇండియాలో సాహో వసూళ్లు జోరందుకోవడం విశేషం. ఓ సినిమాకి నెగిటీవ్ టాక్ వస్తే.. వసూళ్లు అమాంతంగా పడిపోతాయి. కానీ సాహోకి మాత్రం ఆ నష్టం జరగలేదు. ఇదంతా ప్రభాస్ మానియా అనుకోవాలా??