'సాహో' సౌండింగ్‌ ఇంకా కొలిక్కి రాలేదా?

By iQlikMovies - June 06, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మక చిత్రంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'సాహో' టీమ్‌ నుండి మ్యూజిక్‌ త్రయం శంకర్‌ ఎహ్‌సాన్‌ లాయ్‌ తప్పుకున్నాక, ఆ ప్లేస్‌ ఇంకా ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌గా భర్తీ కాలేదు. 'సాహో' ఛాప్టర్‌ 1, ఛాప్టర్‌ 2లకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఇచ్చిన జిబ్రాన్‌ ఓకే అయ్యాడనే వార్తలొచ్చినా, పూర్తి స్థాయిలో ఆయన ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించలేకపోతున్నారట. దాంతో ఇంకా వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్‌ మ్యూజిక్‌ ద్వయం తనిష్క్‌ బగిచ్‌, గురు రాంద్వాల పేర్లు తెరపైకి వచ్చాయి. లేటెస్ట్‌గా 'దేదే ప్యార్‌దే' మూవీకి మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన యంగ్‌ డైనమిక్‌ తనిష్క్‌ బగిచ్‌ స్టైలిష్‌ కంపోజేషన్‌ 'సాహో' టీమ్‌ని ఎట్రాక్ట్‌ చేసిందట.

 

సో వీరి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్‌ క్లారిటీ రానుంది. మరోవైపు 'సాహో' ఆగస్ట్‌లో విడుదల కానుంది. షూటింగ్‌ ఓ కొలిక్కి వచ్చినా, ఆర్‌ఆర్‌ విషయంలో సస్పెన్స్‌ అలానే ఉంది. అయినా, అనుకున్న టైంకి సినిమాని విడుదల చేస్తామని నమ్మకంగా చెబుతున్నారు సాహో టీమ్‌. ఈలోగా మిగిలిన అన్ని పనులూ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్‌ నుండి నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్‌ విజయ్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తుండగా, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాకి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS