పైలెట్‌ పార్వతిపై కన్నేసిన సమంత!

By iQlikMovies - June 06, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

కొరియన్‌ మూవీ 'మిస్‌ గ్రానీ' రీమేక్‌లో నటిస్తున్న సమంత మరో రీమేక్‌పై కన్నేసిందా.? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మలయాళ చిత్రం 'ఉయారే' గురించి సమంత తాజాగా ట్విట్టర్‌లో తెగ పొగిడేస్తూ మాట్లాడింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన పార్వతిపై ప్రశంసల జల్లు కురిపించింది. అందుకు మలయాళ నటి పార్వతి, సమంతకు సోషల్‌ మీడియాలో థాంక్స్‌ చెప్పింది. అసలింతకీ 'ఉయారే' సినిమా సమంతకు నచ్చడానికి కారణమేంటంటే, ఆ సినిమాలో హీరోయిన్‌ పైలెట్‌ కావాలనే లక్ష్యంతో, తన లక్ష్యానికి అడ్డుగా నిలిచిన ప్రేమికుడికి బ్రేకప్‌ చెప్పేస్తుంది.

 

దాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ ప్రేమికుడు పార్వతిపై యాసిడ్‌ దాడికి దిగుతాడు. అయినా, ఆమె ఎంత మాత్రమూ కుంగిపోకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటుంది. అలా టార్గెట్‌ రీచ్‌ అయ్యే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఒత్తిడులూ, ఒడిదుడుకులూ, కష్ట నష్టాలూ సమంతను బాగా టచ్‌ చేశాయి. అందుకే ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడండి. ఫీల్‌ అవ్వండి అంటూ ట్విట్టర్‌ ద్వారా సమంత కోరింది. సమంత చెబితే ఫ్యాన్స్‌ ఊరుకుంటారా.? చూసేయరూ.

 

అలా ఆ సినిమా సంగతి అందరికీ తెలిసింది. ఇదంతా బాగానే ఉంది. కానీ, ప్రస్తుతం సమంత ఎంచుకుంటున్న కథలు ఇదే తరహాలో ఉంటున్నాయి. ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని, ఆదర్శంగా ఉండే సినిమాల్ని ఎంచుకుంటూ సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటోంది సమంత. ఆ కోవలో ఈ సమంత ఖాతాలో ఈ 'ఉయారే' కూడా చేరుతుందా.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS