కొన్ని కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ టెక్నికల్ టీమ్ సహాయంతో తెరకెక్కుతోన్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' వంటి సినిమా తర్వాత ప్రబాస్ నటిస్తున్న చిత్రం కావడంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. కానీ, ఆ అంచనాలకు తగ్గట్లుగా చిత్ర యూనిట్ ప్రవర్తించడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక్క కోటితో తీసిన సినిమాకే కొన్ని కోట్ల మార్గాల్లో పబ్లిసిటీ చేయాల్సిన రోజులివి. పబ్లిసిటీ లేకుంటే, సినిమాని ఎంత బాగా తెరకెక్కించినా ప్రయోజనం లేదు. అలాంటిది 'సాహో' సినిమాకి అస్సలు బజ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
'సాహో ఛాప్టర్స్' పేరుతో స్టార్టింగ్‌లో హడావిడి బాగానే చేశారు. కానీ, సడెన్‌గా 'సాహో' హడావిడి పడిపోయింది. పడిపోవడమేంటీ, మొత్తం జీరో అయిపోయింది. ఓ పక్క ఇప్పటికే సినిమా ఆగస్ట్ 15 నుండి, 30కి వాయిదా పడింది. సినిమా వాయిదా పడడమనే ఇంపాక్ట్ చాలానే ఉంటుంది. దాన్ని ఓవర్ కమ్ చేసేలా ప్రమోషన్స్ నిర్వహించాలి. కానీ, ఆ సంగతిని 'సాహో' టీమ్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఆగస్ట్ 30న 'సాహో' అనే ఓ సినిమా రిలీజవుతుందన్న క్యూరియాసిటీనే ఆడియన్స్‌లో కనిపించడం లేదు. దాంతో, నిర్మాతల్లో టెన్షన్ పెరిగింది. అభిమానుల్లోనూ అలజడి మొదలైంది. దాంతో ప్రమోషన్స్‌లో యాక్టివ్‌నెస్ చూపించేందుకు కసరత్తులు మొదలెట్టారట. అసలే ఓ పక్క 'డియర్ కామ్రేడ్' మేనియా ఓ రేంజ్‌లో ఉంది.
ఈ తరుణంలోనే పనిలో పనిగా 'సాహో'ని కూడా చర్చల్లో ఉంచాలన్న ఆలోచన చేస్తున్నారట. ఆ క్రమంలో త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారట. తాజాగా 'సాహో' నుండి వచ్చిన ఓ రొమాంటిక్ లుక్ ఓ మోస్తరు రెస్పాన్స్ అందుకుంటోంది. అసలు సిసలు రెస్పాన్స్ రావాలంటే, ఇలాంటివి ఒక్కటి చాలదు, చాలా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి ఇకపై అయినా 'సాహో' టీమ్ జాగ్రత్త పడుతుందేమో.