'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి'తో వచ్చిన క్రేజ్ కారణంగా తాను నటించబోయే తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండాలని భావించిన ప్రభాస్, ముందుగా అనుకున్న సబ్జెక్ట్‌లో మార్పులు చేసి, 'సాహో'ని పట్టాలెక్కించాడు. ఇక అనుకున్నట్లుగానే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. దుబాయ్‌లో చిత్రీకరించిన స్టంట్ సీన్స్‌కే వందల కోట్లు ఖర్చయ్యాయి. ఆ సీన్లే సినిమాకి హైలైట్ కానున్నాయి.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని స్టంట్ సీన్లు ఒకదానికి మించి ఒకటి అనేలా ఉండబోతున్నాయట. ఆల్రెడీ విడుదలైన రెండు టీజర్లు ఆ విషయాన్ని స్పష్టపరిచాయి. ఆగష్టులో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఓ చిన్న యాక్షన్ సీన్ సహా పాటల చిత్రీకరణ మిగిలి ఉందట. పాటల కోసం 'సాహో' టీమ్ ఆల్రెడీ లొకేషన్స్ వేట మొదలెట్టేశారు. హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధాకపూర్‌తో ప్రభాస్కి మూడు రొమాంటిక్ సాంగ్స్‌ని ప్లాన్ చేస్తున్నారట.
ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ జూన్ కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్స్‌కి చోటుంది. 'బాహుబలి' రేంజ్‌లో కాకపోయినా, అంతకు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయనీ సమాచారమ్. ఏది ఏమైనా యూనివర్సల్ స్టార్‌గా పాపులర్ అయిన ప్రభాస్కి 'సాహో' అగ్నిపరీక్ష అనే చెప్పాలి. అంచనాలు ఆ స్థాయిలో ఉంటాయి మరి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.