చిత్రలహరి... ఓపెనింగ్ డే రిజల్ట్..?

By Gowthami - April 13, 2019 - 11:05 AM IST

మరిన్ని వార్తలు

వరుసగా ఆరు ఫ్లాపుల తరవాత సాయిధరమ్ తేజ్ నుంచి వచ్చిన సినిమా... `చిత్రలహరి`. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన  ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. శుక్రవారం విడుదలైన  ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. తేజూ గత చిత్రాలకంటే బెటర్ రిపోర్ట్ దక్కింది. వసూళ్లూ బాగానే ఉన్నాయి. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి దాదాపు 3 కోట్ల (షేర్) వరకూ వచ్చాయి. 

 

నైజాంలో దాదాపు 80 లక్షలు సంపాదించిన చిత్రలహరి... సీడెడ్ లో 51 లక్షలు తెచ్చుకుంది. గుంటూరు, ఈస్ట్, వెస్ట్ లలో కూడా మంచి ఓపెనింగ్సే లభించాయి. శని, ఆది వారాలు కూడా ఇదే టెంపో కొనసాగితే.. మైత్రీ మూవీస్ పెట్టుబడి తిరిగి వచ్చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా  ఈ చిత్రం దాదాపు 14 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS