ఓవర్సీస్ మార్కెట్ తెలుగు సినిమా బాక్సాఫీసుకి ఓ వరం.. బలం. ఓవర్సీస్లో మిలియన్ డాలర్లు వసూలు చేయగలిగితే.. ఆ సినిమాకి ఇక తిరుగులేదన్న నమ్మకం మన దర్శక నిర్మాతలకు గట్టిగా ఉంది. యూఎస్‌లో అనుహ్యమైన ఫలితాల్ని సాధించి, మన నిర్మాతలపై డాలర్ల వర్షం కురిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాలు కూడా అక్కడ ప్రభావం చూపించి, లాభాల్ని ఆర్జిస్తున్నాయి. తెలుగు సినిమా మొత్తం యూఎస్ మార్కెట్ పై గురి పెట్టిన ఈ సమయంలో.. ఇటీవల విడుదలైన మెగా హీరో సినిమా విన్నర్... ఓవర్సీస్లో తుస్సుమనిపించింది. దాదాపు రూ.1.6 కోట్లకు విన్నర్ ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయి. తొలి మూడు రోజుల వసూళ్లు చూస్తే కనీసం సగం డబ్బులు కూడా రాలేదు. సోమవారం నుంచి.. యూ.ఎస్‌లో వసూళ్లు మరింత డల్ అవ్వడం ఖాయం. ఈ లెక్కన విన్నర్ ఓవర్సీస్ బయ్యర్లకు తీవ్ర నష్టాల్ని మిగల్చడం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాల నిపుణులు.