సాయి పల్లవి స్పందించదేంటీ?

మరిన్ని వార్తలు

ఈ మధ్య ఏ హీరోయిన్స్‌ మీదా రానన్ని గాసిప్స్‌ సాయి పల్లవి మీద వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. బహుశా మీడియాతోనూ, ఇండస్ట్రీతోనూ ఆమె రెగ్యులర్‌గా టచ్‌లో ఉండకపోవడమే ఈ గాసిప్స్‌కి కారణం కావచ్చు. హీరో నానితో గొడవలు అన్నారు. నిర్మాత దిల్‌రాజుతో విబేధాలు అన్నారు. అయితే అవేమీ నిజం కావని తేలిపోయింది. రెమ్యునరేషన్‌పై గాసిప్స్‌ కూడా ఆమె గురించి ఎక్కువగానే వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌ ప్రకారం, సాయి పల్లవికి ఈ గాసిప్స్‌తో సంబంధం ఏమీ లేదని తేలుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తమపై వచ్చే గాసిప్స్‌ని పట్టించుకోకపోతే అవి ఆయా సెలబ్రిటీస్‌ ఇమేజ్‌ని దెబ్బ తీస్తాయి. ఒప్పుకున్న సినిమాని కామ్‌గా కూల్‌గా కంప్లీట్‌ చేసి మంచి పేరు తెచ్చుకోవడంతోనే సరిపోదు. గాసిప్స్‌ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. మంచి కథల్ని ఎంచుకోవడం, సిన్సియర్‌గా ఆ సినిమాకి పని చేయడం, ఇవి మాత్రమే సాయి పల్లవికి తెలుసు. అంతకు మించి, సినిమాల్లో కొనసాగడానికి తగిన చాణక్యం ఈ రోజుల్లో అవసరమని సాయి పల్లవి గుర్తించాలి. 

ఇప్పుడున్న హీరోయిన్స్‌లో నటన, డాన్సింగ్‌ స్కిల్స్‌ ప్రకారం చూస్తే సాయి పల్లవి తర్వాతే ఎవరైనా. ఇంకా పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు కాబట్టి ఆమెని అప్‌ కమింగ్‌ హీరోయిన్‌గానే చాలా మంది గుర్తిస్తున్నారు. అది నిజం కూడా. స్టార్‌ హీరోయిన్‌ అయిపోయాననే అహంకారం ఆమెలో ఏమాత్రం కనిపించదు. కానీ సినిమా ఇండస్ట్రీకి, మీడియాకి దూరంగా ఉండడంతో అదే అహంకారంగా కనిపిస్తోంది అందరికీ. ఇతర భాషల్లోనూ సినిమాలు చేయడం వల్ల తెలుగు మీడియాకి టచ్‌లో ఉండలేకపోతోంది సాయి పల్లవి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS