దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో కథానాయికలు దిట్ట. తమ నేమూ.. ఫేమూ కొంతకాలమే అని వాళ్లకు తెలుసు. అందుకే... వీలైనంతగా తమ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. డిమాండ్ ఉండగానే నాలుగు డబ్బులు సంపాదించాలని తహతహలాడుతుంటారు. సాయి పల్లవి కూడా అదే చేస్తోంది. తన పారితోషికంతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. పవన్ కల్యాణ్ `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ కోసం సాయి పల్లవిని ముందుగా సంప్రదించారు. ఆ సినిమా కోసం ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. అంత ఇచ్చుకోలేక.. నిత్యమీనన్ తో సర్దుకోవాల్సివస్తోంది.
సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. అయితే... 3 కోట్లు ఇచ్చేంత కాదు. ఎందుకంటే... `అయ్యప్పయుమ్...` హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాదు. హీరోయిన్లకు ఈ కథలో పెద్ద స్కోప్ లేదు. అలాంటప్పుడు 3 కోట్లు ఇచ్చి, సాయి పల్లవిని ఎంచుకోవడం ఎందుకన్నది నిర్మాత పాయింట్. అందుకే సాయి పల్లవిని పక్కన పెట్టాల్సివచ్చింది. లవ్ స్టోరీలాంటి సినిమాకి సాయి పల్లవి ఎంత డిమాండ్ చేసినా ఫర్వాలేదు. ఎందుకంటే ఈ కథంతా సాయి పల్లవి చుట్టూ తిరుగుతుంది కాబట్టి. కానీ అన్ని సినిమాలూ అలా ఉండవు కదా. సాయి పల్లవి ఆ విషయాన్ని గుర్తించుకుంటే మంచిది.