మలర్ బ్యూటీ సాయి పల్లవి ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలనుకుంటుంది. మామూలుగా ముద్దుగుమ్మలు హాట్ హాట్‌గా ఫోటో షూట్స్ చేయించుకుని ఆ పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫాలోవర్స్‌ని పెంచుకోవాలనుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నం కదా. మలయాళంలో 'విషు'గా పిలుస్తారు ఉగాదిని. ఈ విషు పండగను పురస్కరించుకుని సాయి పల్లవి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మలయాళంలో ఈ పండుగకు వేసుకునే వస్త్రధారణలో సాయి పల్లవి అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ కలర్ బోర్డర్ వైట్ శారీలో, తల నిండా పువ్వులతోనూ, లూజ్ హెయిర్ పాపిట బిళ్లతో అందంగా ఫోటోలు దిగింది. హాట్ హాట్ పిక్స్‌కే కాదు, ట్రెడిషనల్ పిక్స్‌కీ మేం లైక్స్ కొడతాం అని నెటిజన్లు నిరూపించుకున్నారు సాయి పల్లవి ఫోటోలతో. ఏకంగా వేల సంఖ్యలో లైకులు కొట్టి, సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతూ, ప్రశంసలు గుప్పించారు.
పండగలకు పూనమ్ పాండే, షెర్లీన్ చోప్రా వంటి ముద్దుగుమ్మలు ఒంటిపై నూలు పోగులు కూడా లేకుండా, తమదైన హాట్‌నెస్‌తో తమని తాము పబ్లిసిటీ చేసుకుంటున్న మన సోషల్ మీడియా సమాజంలో సాయి పల్లవి, రష్మికా వంటి ట్రెడిషనల్ అందాలకూ ఆదరణ తక్కువేం లేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంలో సాయి పల్లవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. అలాంటిది విషు పేరు చెప్పి పోస్ట్ చేసిన ఈ ట్రెడిషనల్ గ్లామర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎన్‌జీకే' సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది.