బ్రేకింగ్ న్యూస్‌: సాహోలో స‌ల్మాన్‌..??

By iQlikMovies - May 22, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

ఇప్ప‌టికే `సాహో`పై అంచ‌నాలు మిన్నంటాయి. దాదాపు 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై బాలీవుడ్ క‌న్ను కూడా ప‌డింది. అక్క‌డి మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకుని శ్ర‌ద్దాక‌పూర్‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ఇప్పుడు మ‌రో స్పెష‌ల్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ చేర‌బోతోంది. సాహోలో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఈ విష‌య‌మై చిత్ర‌బృందం ఇప్ప‌టికే స‌ల్మాన్‌ని సంప్ర‌దించింద‌ని, ఈ సినిమాలో న‌టించ‌డానికి స‌ల్మాన్ అంగీక‌రించ‌డని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

స‌ల్మాన్‌ది చిన్న పాత్రే అని, కాక‌పోతే... ఈ సినిమాకి `హై` తీసుకొచ్చే అంశాల‌లో ఆ స‌న్నివేశం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని స‌మాచారం అందుతోంది. సాహో చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. సల్మాన్ త్వ‌ర‌లోనే `సాహో` టీమ్ తో క‌లుస్తార‌ని, ఆ స‌న్నివేశంతోనే టాకీ పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది. నిజంగానే స‌ల్మాన్ సాహోతో క‌లిస్తే... అది సంచ‌ల‌న‌మే అవుతుంది. ఈ దెబ్బ‌తో బాలీవుడ్‌లో సాహో క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS