స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం తో టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో సైతం తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నాడు.
సల్మాన్ ట్యూబ్ లైట్, బన్నీ దువ్వాడ ఒకేరోజు రిలీజ్ అయినా కలెక్షన్స్ పరంగా బన్నీ ఒక రెండు కోట్లతో ముందున్నాడు. అయితే హిందీ సినిమాకి సహజంగా మార్కెట్ ఎక్కువ అలాంటిది ఆ సినిమా కలెక్షన్స్ ని ఓవర్టేక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మూడు రోజుల్లో ట్యూబ్ లైట్ రూ 64.77 కోట్లు ఆర్జీంచగా దువ్వాడ చిత్రానికి రూ 66కోట్ల కలెక్ట్ చేయడంతో సల్మాన్ ని బన్నీ దాటేసాడు అని చెప్పొచ్చు.
అయితే ఈ రోజు కూడా హాలిడే అవ్వడంతో మరి ఈ చిత్ర కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.