టాలీవుడ్‌లో ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి, మధ్యలో కొంత టైం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తన మాటల దాడి మొదలెట్టింది. సోషల్ మీడియా వేదికగా మరోసారి విజృంభిస్తోంది. ఈ సారి ఆమె మాటల దాడి ఎవరిపైనో తెలుసా? గెస్ చేసి చూడండి.
పోనీలే వద్దులే ఎక్కువగా కష్టపడకండి కానీ, సినీ నటి, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అయిన రోజారెడ్డిపై. గతంలో రాజశేఖర్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు రోజా ఇటీవల స్పందించారు. ఆయనతో నేను రెండు సినిమాల్లో నటించాను. ఆయన చాలా మంచివారు.. చాలా హుందాగా వ్యవహరిస్తారు అని రోజా చెప్పారు. ఆ మాటలకే ఇప్పుడు శ్రీరెడ్డి, రోజాకి కౌంటర్ ఇచ్చింది.
ఓలమ్మో రోజమ్మా ఇండస్ట్రీలో నిన్ను ఎవరూ కెలకలేదామ్మా. అయితే నువ్వు ఎవ్వరికీ నచ్చలేదు కాబోలు. కాస్టింగ్ కౌచ్ లేదంటావా? ఇండస్ట్రీలో.. అంటూ ఇంకా పలు రకాల దూషణలకు దిగింది. అసలే రోజా అక్కడ. రకుల్ ప్రీత్‌సింగ్‌ని తిట్టినట్లు, ఇంకొకర్ని తిట్టినట్లు రోజాని తిడితే, శ్రీరెడ్డికి ఇంకేమైనా ఉందా? అలాంటిది రోజాని ఎవరో కెలకడం కాదు. శ్రీరెడ్డే కెలికింది.
శ్రీరెడ్డి లీక్స్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అంతగా పబ్లిసిటీ రావడం లేదు. మీడియా మొదట్లో ఆమె పట్ల చూపించిన అత్యుత్సాహం ఇప్పుడు చూపించడం లేదు. దాంతో రోజాలాంటి పాపులర్ వ్యక్తిని కెలికితే, మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావచ్చునని భావించింది కాబోలు. ఏరుకుని, ఎంచుకుని రోజాని తగులుకుంది. ఒకవేళ ఈ ఆరోపణలపై రోజా స్పందిస్తే శ్రీరెడ్డి పరిస్థితి ఏంటో. వెయిట్ అండ్ సీ.!