దాదాపు పదేళ్లకు పైగానే సినీ కెరీర్ ఉన్న సమంత, ఎన్నో ఆటుపోట్లు చవి చూసింది. సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్, రూమర్స్ ఇలా ఒక్కటేమిటి.. చిత్ర సీమలోని రంగులన్నింటినీ చూసేసింది. అక్కినేని కుర్రోడిని పెళ్లి చేసుకుని, అక్కినేని కోడలిగా హుందాతనాన్ని అంది పుచ్చుకుంది. పెళ్లి తర్వాత కూడా నిరాటంకంగా, నిరభ్యంతరకంగా హీరోయిన్లుగా కొనసాగొచ్చు.. అని సమంత నిరూపించింది. అందుకే సమంత ఈజ్ స్పెషల్. అభిమానులు తనకిచ్చే సజిషన్స్ పోజిటివ్ అయినా, నెగిటివ్ అయినా అనుకూలంగా స్వీకరించే తత్వం అందరిలోనూ ఉండదు.
కానీ, సమంతది మాత్రం ఆ తరహా వ్యక్తిత్వమే. అందుకే సక్సెస్ఫుల్ హీరోయిన్గా సమంత ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటోంది. ఫ్యాన్స్ ఎంకరేజ్మెంటే తనకు కొండంత బలం అంటోంది. ఆ ఎంకరేజ్మెంట్కి తనకున్న అనుభవం కొంత తోడయ్యిందంటోంది. ఏ విషయాన్ని అయినా, ఎవరో చెప్పారని కాకుండా, అనుభవపూర్వంగా తెలుసుకుని, అంచనా వేయాలని సమంత చెబుతోంది.
'మజిలీ' సినిమాతో భర్తకు తిరుగులేని హిట్ అందించింది. ఇప్పుడు '96' రీమేక్‌లో నటిస్తోంది. మరిన్ని విలక్షణ ప్రాజెక్టుల్ని ఒప్పుకునే దిశగా సమంత కసరత్తులు చేస్తోంది. ఫిట్‌గా ఉంటేనే అసలైన ఆరోగ్యం అని నమ్మే సమంత, తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రతీ రోజూ జిమ్‌లో కొంత టైమ్ స్పెండ్ చేయడాన్ని తన లైఫ్ స్టైల్లో ఓ అలవాటుగా మార్చుకుంది. ఛాలెంజింగ్ ఫీట్స్ చేయడంలోనూ సమంత ఎప్పుడూ ముందుంటుంది.