అక్కినేని కోడలికి ఆ ఒక్క కోరికే మిగిలుందట!

మరిన్ని వార్తలు

కమర్షియల్‌ హీరోయిన్‌గా చాలా విజయాలు అందుకుని, ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకెళ్తున్న సమంతకు స్టార్‌డమ్‌ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. కొత్త కొత్త క్యారెక్టర్లను టచ్‌ చేసే అవకాశం కూడా కలుగుతోంది. అయితే, పూర్తిగా స్పోర్ట్స్‌ నేపథ్యం ఉన్న సినిమాలో నటించాలనుందన్న తన కోరిక మాత్రం ఇంకా తీరడం లేదని సమంత బాధపడుతోందట. ఇటీవల ఐశ్వర్యా రాజేష్‌ నటించిన 'కౌసల్యా కృష్ణ మూర్తి' తరహాలో ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మూవీలో నటించాలని ఉందని సమంత చాలా సార్లు చెప్పుకొచ్చింది

 

ఫిజిక్‌ని కాపాడుకోవడంలో సమంత ఎప్పుడూ వెనకడుగు వేయదు. ఛాలెంజింగ్‌ ఫీట్స్‌ చేయడంలో కూడా సమంత ఈ మధ్య టాప్‌ రేపేస్తోంది. అంతేకాదు, మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా సమంతకు ప్రావీణ్యం ఉంది. రియల్‌గా ఇన్ని టాలెంట్స్‌ ఉన్న సమంత, రీల్‌లో ఆ టాలెంట్స్‌కి పదును పెట్టాలనుకుంటోందట. 'రంగస్థలం', 'యూ టర్న్‌', 'ఓ బేబీ', తదితర చిత్రాల్లో ఆయా పాత్రలు తన కెరీర్‌లో ఛాలెంజ్‌ విసిరిన పాత్రలు. ఆయా పాత్రలతో ప్రశంసలు అందుకున్న సమంత నుండి అభిమానులు కూడా ఆమె కోరుకున్నట్లుగానే ఆశిస్తున్నారు.

 

పూర్తి స్థాయి స్పోర్ట్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మూవీలో సమంతను ఊహించుకుంటున్నారు. అయితే, ఆ తరహా కథలు ఆమె వద్దకు ఇంతవరకూ రాలేదట. ఒకవేళ వస్తే అస్సలు కాదనుకోనని చెబుతోంది. ఇటీవల బ్యాడ్మింటన్‌ దిగ్గజం పి.వి.సింధు బయోపిక్‌లో సమంత నటిస్తోందట అనే గాసిప్‌ చక్కర్లు కొట్టింది. కానీ, అలాంటి ఆఫర్సేమీ సమంత వద్దకు రానే లేదట. ఈ పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె నటించనుందని తాజా సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS