హీరోయిన్‌తో నగ్నంగా డాన్స్‌ చేయిద్దామనుకున్నారట.!

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ బాంబ్‌ ఇంకోసారి పేలింది. ఈ సారి బాంబ్‌ పేల్చింది బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా. తెలుగులో బాలకృష్ణ సరసన 'వీరభద్ర' సినిమాలో నటించింది ఈ భామ. ఓ బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడనీ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ ఆరోపణల్ని నానాపటేకర్‌ లైట్‌ తీసుకున్నాడు.100 మందికి పైగా ఉన్న సెట్‌లో నేను ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి అవకాశం ఎక్కడుందని ప్రశ్నించాడాయన. 

తాజాగా మరొకరికపై తనూశ్రీదత్తా ఆరోపణలు చేసింది. దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి 'చాకొలెట్‌' సినిమా షూటింగ్‌ సమయంలో నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ ముందు నగ్నంగా డాన్స్‌ చేయాలని తనూశ్రీతో అన్నాడట. దానికి ఇర్ఫాన్‌ ఖాన్‌ అడ్డు తగిలాడట. ఇర్ఫాన్‌తో పాటు సునీల్‌ శెట్టి కూడా తనూశ్రీ దత్తాకి అండగా నిలిచారట. ఇదీ తనూశ్రీ దత్తా తాజా బాంబ్‌. ఆమె ఆరోపణల్లో నిజానిజాలు సంగతి పక్కన పెడితే, ఆమె దైర్యానికి పలువురు సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. అలాగని నానాపటేకర్‌పైనా, వివేక్‌ అగ్నిహోత్రి పైనా విమర్శలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 

ముందు ముందు తనూశ్రీ దత్తా ఆరోపణలు ఇంకెలాంటి సంచలనాలకు దారి తీస్తాయో కానీ, బాలీవుడ్‌ మాత్రం తనూశ్రీ దత్తా దెబ్బకు విలవిల్లాడుతోంది. ఎప్పుడు ఎవరి పేరు వినాల్సి వస్తుందోనని బాలీవుడ్‌ ఆందోళన చెందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS