టాలీవుడ్‌లోని టాలెంటెడ్ దర్శకులలో సంపత్‌నంది పేరు తప్పకుండా ఉంటుంది.కాకపోతే.. తనకు సరైన హీరో దొరకడం లేదు. కథలు రెడీగా ఉన్నా, హీరోల కొరతతో ప్రాజెక్టు సెట్ కావడం లేదు. ఈమధ్య ఇద్దరు ముగ్గురు హీరోలకు కథలు చెప్పాడు. కానీ కుదర్లేదు. ఇప్పుడు సంపత్ నంది ప్రయత్నం ఫలించింది. తన కథకు తగిన హీరో దొరికేశాడు. అవును... సంపత్ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తోంది. మెగా హీరో.. సాయిధరమ్ తేజ్‌తో.
ఇటీవల తేజ్‌ని కలిసిన సంపత్... ఓ కథ చెప్పడం, అది తేజ్‌కి నచ్చేయడం జరిగిపోయాయి. వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కాకపోతే తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటితో పాటు దీన్నీ సమాతంతరంగా పట్టాలెక్కిస్తాడా, లేదంటే అవి రెండూ పూర్తయ్యాక మొదలవుతుందా? అనేది చూడాలి. సాయిధరమ్ తేజ్ ఎప్పటి నుంచో మంచి మాస్ కమర్షియల్ కథ కోసం ఎదురు చూస్తున్నాడు. సంపత్ కూడా అలాంటి కథే చెప్పాడని టాక్. మరోవైపు నందమూరి బాలకృష్ణకు సైతం సంపత్ నంది ఓ కథ చెప్పాడు. దానిపై ఇంకా క్లారిటీ రావాల్సివుంది.