సోషల్‌ మీడియాలో సంపూ ఊపేస్తున్నాడూ!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా సంచలనంగా అంకురించి, వెండితెరపై తనదైన శైలిలో స్టార్‌డమ్‌ దక్కించుకున్న హీరో సంపూర్ణేష్‌ బాబు. అప్పుడెప్పుడో 'హృదయకాలేయం' సినిమాతో ప్రభంజనం సృష్టించాడు. ఆ తర్వాత ఒకటీ అరా చేసినా, అవేమీ అంత లెక్కల్లోకి రావు కానీ, చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు 'కొబ్బరిమట్ట'తో వచ్చాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్‌ పోజిటివ్‌గా వినిపించడంతో, సంపూని చూసేందుకు ధియేటర్స్‌కి పరుగులు పెట్టారు ఆయన అభిమానులు. అభిమానుల ఉత్సాహాన్ని ఏమాత్రం నిరుత్సాహపరచలేదు సంపూర్ణేష్‌బాబు.

 

ఆయన స్టామినాకి తగ్గట్లుగా, ప్రేక్షకుల్ని నవ్వించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టాడు. అందులో విజయం సాధించాడు. తీసుకున్న టికెట్‌ డబ్బులకు సంపూ పూర్తిగా న్యాయం చేశాడనే ఫీలింగ్‌, సినిమా చూసిన ప్రేక్షకుడిలో కలుగుతుందంటూ, రిపోర్ట్స్‌ అందుతున్నాయి. సో ఇంకేముంది.. సంపూ మళ్లీ హిట్టు కొట్టాడంతే. ఓ మాదిరి టాక్‌ వస్తేనే సంపూ సినిమాకి సూపర్‌ హిట్‌ అన్న లెక్కే. అలాంటిది, ఈ స్థాయిలో పోజిటివ్‌ టాక్‌ వచ్చిందంటే, 'ఆడు మగాడ్రా బుజ్జీ..' అనుకోకుండా ఉండలేకపోతున్నారు.

 

డాన్సులు, ఫైట్లు, డైలాగులు.. కడుపుబ్బ నవ్వించే కామెడీ.. ఇంకేం కావాలి సగటు మాస్‌ ప్రేక్షకుడికి. అవన్నీ 'కొబ్బరిమట్ట'తో ఇచ్చేశాడు సంపూర్ణేష్‌ బాబు. అందుకే సంపూకి తిరుగులేదంతే. 'పెదరాయుడు', 'ఆండ్రాయుడు', 'పాపారాయుడు' ఇలా మూడు పాత్రల్లోనూ సంపూ నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ పనికి తగిన ఫలితం అందుకున్నాడు 'కొబ్బరిమట్ట'తో. సోషల్‌ మీడియాలో సంపూర్ణేష్‌ బాబు సితక్కొట్టేస్తున్నాడంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS