'దిక్కులు చూడకు రామయ్య' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బ్యూటీ సనా మక్బూల్. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు ఈ బ్యూటీ. తండ్రీ కొడుకులతో లవ్ అఫైర్ నడిపిన అమ్మాయి క్యారెక్టర్లో సనా మక్బూల్ మంచి నటన కనబరించింది ఈ సినిమాలో. నటన పరంగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. ఓ పక్క ముదురు ప్రేమకీ, మరో పక్క లేత ప్రేమకీ బాగా సెట్ అయిపోయింది ఆ సినిమాలో సనా.
అయితే ఎందుకో మరి తెలుగులో ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోలేకపోయింది. చిన్న సినిమా అయినా కానీ ఈ సినిమా అప్పట్లో భలే సెన్సేషన్ అయ్యింది. అలాగే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది కూడా. డైరెక్టర్ డిఫరెంట్ థాట్‌కి దృశ్య రూపం ఈ సినిమా. ప్రేక్షకుల్నీ బాగానే అలరించింది. అజయ్, నాగ శౌర్యలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి సనా మక్బూల్ నటన ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి దూరమైంది. ఈ గ్యాప్‌లో ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమాలో నటించింది. అది 'రంగూన్' చిత్రం. గౌతమ్ కార్తీక్ సరసన ఈ సినిమాలో నటించింది సనా. అయితే తాజాగా ఈ బ్యూటీ మళ్లీ తెలుగులోకి అడుగిడుతోంది. 'మామా చందమామా' సినిమాతో ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ ముద్దుగుమ్మకి టాలెంట్ ఉన్నా ఎందుకో అవకాశాలే ఆచి తూచి వస్తున్నాయి. ఒకవేళ ఈ బ్యూటీనే ఏరి కోరి అవకాశాలు ఎంచుకుంటోందో ఏమో కానీ, మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఇన్నాళ్ల తర్వాత మరోసారి తన టాలెంట్ ప్రదర్శించబోతోందనే చెప్పాలి 'మామా చందమామా' సినిమాతో.