హిందీలో రూపొందించిన పద్మావతి చిత్రం వచ్చే నెల 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
ఈ తరుణంలో పద్మావతి చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలని కించపరిచేలా దర్శకుడు చిత్రీకరణ జరిపాడంటూ కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా చిత్రాన్ని విడుదల కానివ్వకుండా ఆపడానికి కోర్టులో కేసులో వేయనున్నాయి అని సమాచారం.
అయితే ఈ తరుణంలో దర్శకుడు సంజయ్ ఒక వీడియో ద్వారా ఈ వివాదం పై స్పందించాడు. తాను ఈ చిత్రాన్ని చాలా భాధ్యాతాయుతంగా తీసాను అని అలాగే బయట ప్రచారం అవుతున్న మేర తాను ఎటువంటి వివాదస్పద సన్నివేశాలను ఈ సినిమాలో పెట్టలేదు అని తెలిపాడు.
ఇక పద్మావతి చిత్రాన్ని అందరు ఆదరించాలి అని కోరాడు.