'అంతరిక్షమూ'' అద్భుతాల పక్షమే.!

మరిన్ని వార్తలు

విజువల్‌ వండర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రోబో 2.0' రికార్డులు సృష్టిస్తోంది. ఇక నెక్ట్స్‌ వండర్‌ 'అంతరిక్షం'. త్వరలో తెలుగులో విడుదల కాబోతున్న 'అంతరిక్షం' సినిమా గురించిన చర్చ మొదలైంది. అవును మరి తొలిసారిగా తెలుగులో పూర్తి స్థాయి స్పేస్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి వ్యోమగామిగా వరుణ్‌తేజ్‌ గెటప్‌ ఒక్కటే రివీల్‌ అయ్యింది. కానీ. 'ఘాజీ' చిత్రంతో తానేంటో ప్రూవ్‌ చేసుకున్న డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది.

సో ఎక్కువగానే ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు మరి. ఏకంగా సబ్‌మెరీన్‌ని వెండితెరపై ఆవిష్కరించేశాడీ యంగ్‌ డైరెక్టర్‌. ఇప్పుడు అంతరిక్షాన్ని కళ్ల ముందు కట్టిపడేస్తానంటున్నాడు. డిశంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది 'అంతరిక్షం' మూవీ. ఇదో సినిమాలా కాకుండా, విజువల్‌ వండర్‌గా తీర్చి దిద్దుతున్నాడట సంకల్ప్‌రెడ్డి. ఇక ఈ సినిమా నుండి లేటెస్టుగా రిలీజైన లిరికల్‌ వీడియో సాంగ్‌ తెగ హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ సాంగ్‌ జస్ట్‌ ఓ రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ అంతే. వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా కనిపిస్తున్నారు.

'చెలియా' ఫేం అదితీరావ్‌ హైదరీ ఈ సినిమాలో ఇంకో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇద్దరు హీరోయిన్స్‌కీ ప్రాధాన్యత ఉంది ఈ సినిమాలో. జస్ట్‌ గ్లామర్‌ కోసమే కాక, హీరోతో పాటు హీరోయిన్స్‌ ఇద్దరూ కూడా అంతరిక్ష వ్యోమగామిల్లాగే కనిపిస్తారట. కాగా ఇంతవరకూ విడుదలైన పోస్టర్స్‌, టీజర్స్‌ కాదు, త్వరలో ఈ సినిమా నుండి రాబోయే సర్‌ప్రైజ్‌ అసలు సిసలు కిక్‌ ఇవ్వబోతోందట. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS