'సప్తగిరి' బ్రాండ్‌ మళ్లీ పేలింది

మరిన్ని వార్తలు

'సప్తగిరి' బ్రాండ్‌తోనే సినిమాలు తెరకెక్కిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్నాడు కమెడియన్‌ సప్తగిరి. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో హీరోగా మారిన మనోడు తొలి సినిమాతోనే సక్సెస్‌ని అందుకున్నాడు. అలాగే 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాడు సప్తగిరి. బాలీవుడ్‌లో 'జాలీ ఎల్‌ఎల్‌బి' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది ఈ చిత్రం. చరణ్‌ లక్కాకుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

సినిమా మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. కమెడియన్‌ నుండి, హీరోగా మారిన సప్తగిరి తన నేమ్‌ బ్రాండ్‌తోనే మళ్లీ హిట్‌ కొట్టాడు. సినిమా మొదట్నుంచీ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు సప్తగిరి. అదే కాన్ఫిడెన్స్‌ ఆయన్ని సక్సెస్‌ వైపు నడిపించింది. అయితే హీరోగా మారిన సప్తగిరి ఇకపై కమెడియన్‌గా నటించడా? అంటే ఖచ్చితంగా కాదనే అంటున్నాడు. హీరోయిజం, హీరోయిజమే, కామెడీ కామెడీనే అంటున్నాడు. ఓ పక్క హీరోగా చేస్తూనే, కమెడియన్‌గానూ మెప్పిస్తానంటున్నాడు. 

అయితే హీరోగా తెరకెక్కించే సినిమాలు కామెడీతో పాటు, సామాజిక అంశాలతో కూడుకున్నవిగా ఉంటాయంటున్నాడు. తొలి సినిమాలో కానిస్టేబుల్‌గా చేశాడు. రెండో సినిమాకి లాయర్‌ అయ్యాడు. అలాగే మూడో సినిమాలో కూడా ఏదో ఒక సామాజిక బాధ్యత ఉన్న క్యారెక్టర్‌నే ఎంచుకుంటాడట. స్టోరీని అందుకు తగ్గట్లుగానే ఎంచుకుంటానంటున్నాడు సప్తగిరి. కెరీర్‌ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు సప్తగిరి. తన కృషీ, పట్టుదలే తననీ స్థాయిలో నిలబెట్టాయంటున్నాడు. వాటిని ఆధారంగా చేసుకునే కెరీర్‌ బిల్డప్‌ చేసుకుంటూ ముందుకు సాగాలని అంటున్నాడు. అలాగే తన తదుపరి చిత్రం వివరాలను త్వరలోనే తెలియచేస్తానంటున్నాడు సప్తగిరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS