విజయ్ దేవరకొండతో డేట్ చేయాలని ఉందంటూ బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఇటీవల ఓ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ సీజన్-7లో పాల్గొన్నారు సారా. ‘నువ్వు ఎవరితోనైనా డేట్ చేయాలనుకుంటున్నావా?’ అని కరణ్ ప్రశ్నించగా.. ‘విజయ్ దేవరకొండ’ అని సారా సమాధానమిచ్చారు. తన గురించి సారా చేసిన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందించారు. హార్ట్ సింబల్ జతచేర్చి ప్రేమను ఆమెకు పంపుతున్నట్లు ట్వీట్ చేశారు
లైగర్’తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ధర్మా ప్రొడెక్షన్స్ పతాకంపై కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. కిక్ బాక్సింగ్ కథాంశంతో సిద్ధమైన ఈసినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.