ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది, హీరోలకు ధీటుగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ విజయశాంతి, రాజకీయాల్లో అడుగుపెట్టాక, సినిమాలకు దూరమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. వస్తూ వస్తూనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరూ..'లో ఓ ఇంపార్టెంట్ రోల్ దక్కించుకుని, ఆటిట్యూడ్ కా క్వీన్ అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రీ ఎంట్రీ మూవీ సంగతిలా ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె రాజకీయాల్ని వదిలిపెట్టరు అనడానికి తాజాగా రాజకీయాలకూ సంబంధించి విజయ శాంతి వేసిన పొలిటికల్ సెటైర్ నిదర్శనంగా నిలిచింది.
ఇటీవల అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ విషయమై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దొరగారు స్పందించలేదేం.. సుప్రీం తీర్పు ఆయనకు రుచించలేదు కాబోలు..' అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్‌గా ఓ పెద్ద పోస్ట్ పెట్టారు విజయశాంతి. ఈ ఇష్యూపై గతంలో కేసీఆర్ రెస్పాండ్ అయిన విధానం, తీర్పు అనంతరం తీర్పును పక్కన పెట్టి, ఆయన వ్యవహరిస్తున్న తీరునూ కంపేర్ చేస్తూ, గతంలో కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ కూడా పోస్ట్ చేశారు. అంటే, ఇటు రాజకీయాల్ని, అటు సినిమాల్నీ కూడా విజయశాంతి ఓ ఆట ఆడించేయనున్నారన్న మాట. దటీజ్ లేడీ సూపర్ స్టార్.