నినువీడని నీడని నేనేతో ఓ హిట్టు అందుకున్నాడు సందీప్ కిషన్. తాను కథానాయకుడిగా నటించిన `తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్` త్వరలోనే విడుదల కాబోతోంది. హన్సిక కథానాయికగా నటించిన ఈచిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే శాటిలైట్,డిజిటల్ రైట్స్‌కి మంచి గిరాకీ ఏర్పడింది. తెనాలి రామకృష్ణ శాటిలైట్, డిజిలట్ రైట్స్ ఏకంగా 3 కోట్లకు అమ్ముడైపోయాయి.
సందీప్ కిషన్ కెరీర్‌లోనే ఇది రికార్డు ధర. జి.నాగేశ్వరరెడ్డి సినిమాలన్నీ వినోద ప్రధానంగానే ఉంటాయి. అలాంటి సినిమాలకు శాటిలైట్ రేట్లు బాగుంటాయి. పైగా హన్సిక గ్లామర్ ప్రధాన ఆకర్షణ. అందుకే ఈ స్థాయిలో డబ్బులొచ్చాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.