సర్కారు వారి పాట గురించి ఎక్కువ మాట్లాడుకునేలా చేసిన డైలాగు ''ఓ వంద వయాగ్రాలేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికొచ్చినట్లు వచ్చారు'' . నిజానికి ఈ సినిమాలో ఈ డైలాగ్ సెట్ కాలేదు. అయినా ఈ డైలాగ్ ని సర్కారు వారి టీం వదలడం లేదు, కర్నూల్ లో సర్కారు వారి సక్సెస్ మీట్ జరిగింది. ఈ వేడుకలో ఓ డిస్ట్రిబ్యూటర్ ఊగిపోయి మాట్లాడారు.
''సర్కారు వారి పాట నాగురోజుల్లోనే 75శాతం రికవరీ. మహేష్ బాబు గారి కెరీర్ లో ఇదే మొదటిసారి. ఇక నుంచి ఆటే .. కలెక్షన్స్ వేట. సర్కారు వారి పాట నాలుగు వయగ్రాలు కలెక్ట్ చేసింది. వంద రోజుల్లో వయోగ్రాలు కలెక్ట్ చేసి వంద రోజుల పండగలో మళ్ళీ కలుద్దాం'' సెలవిచ్చారాయన.
అంతా బావుంది కానీ ఈ వయాగ్రాల పోలిక ఏమిటో అర్ధం కాదు. వంద వయాగ్రాలకి వందరోజులుకి లింక్ ఏమిటో.. అసలు కలెక్షన్స్ ని వయాగ్రాలతో పోల్చడం ఏంటో.. అన్నట్టు సదరు డిస్ట్రిబ్యూటర్ స్పీచ్ మహేష్ బాబుకి బాగా నచ్చింది. మహేష్ స్పీచ్ లో ప్రత్యేకంగా ఆ డిస్ట్రిబ్యూటర్ గురించి ప్రస్థావించడం కొసమెరుపు.