నటనకు గుడ్‌బై చెప్పనంటోన్న సాయేషా.!

మరిన్ని వార్తలు

ఒకప్పుడు ముద్దుగుమ్మల కెరీర్‌కి పెళ్లి ఆటంకమయ్యేది. కానీ ఇప్పుడలా కాదు. విచిత్రంగా పెళ్లి తర్వాత ముద్దుగుమ్మల కెరీర్‌కి బూస్టప్‌ వస్తోంది. ఫ్రెష్‌ భామల అవకాశాల్ని కూడా ఈ ముద్దుగుమ్మలే తన్నుకెళ్లిపోతున్నారు. ఇక తాజాగా పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌ కూడా పెళ్లి తర్వాత కేవలం ఒకే ఒక నెల వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేసి, తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. 

 

కన్నడలో 'యువరత్న', సూర్యతో నటిస్తున్న 'కాప్పాన్‌', జీవి ప్రకాశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'వాచ్‌మెన్‌' తదితర సినిమాలు ప్రస్తుతం సాయేషా చేతిలో ఉన్నాయి. సగం షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా సెట్స్‌లోకి తాజాగా సాయేషా ఎంట్రీ ఇచ్చిందనీ కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. అతి త్వరలోనే ఈ సినిమాల్ని పూర్తి చేసుకుని, తర్వాత మరిన్ని కొత్త సినిమాలను ఎంపిక చేసుకునే యోచనలో సాయేషా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

అంతేకాదు, సాయేషా ఇకపై తెలుగు సినిమాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లికి ముందే తెలుగులో అవకాశాలు రాలేదు సాయేషాకి. పెళ్లి తర్వాత వచ్చే ఛాన్స్‌ ఉందా.? అంటే, ఏమో ఏం చెప్పగలం.? కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకన్నట్లుగా, పెళ్లి కలిసొచ్చే అంశమే అవుతోందిప్పుడు అందాల భామలకు. అలా కాలం కలిసొస్తే సాయేషా తెలుగులో కూడా బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS