'అఖిల్‌'భామ సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందా.?

మరిన్ని వార్తలు

కోలీవుడ్‌లో గత కొంతకాలంగా హీరో ఆర్య, హీరోయిన్‌ సాయేషా సైగల్‌ మధ్య అఫైర్‌ నడుస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ ఉత్త గాసిప్సే అని కొట్టిపారేశారు. కానీ తాజాగా ఆర్య, సాయేషా కన్‌ఫామ్‌ చేసేశారు. లవర్స్‌ డే సందర్భంగా ఆర్య సాయేషా తీపి కబురు చెప్పేశారు.

 

పెళ్లి కన్‌ఫామ్‌ చేసేశారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి మార్చిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు ఆర్య, సాయేషా. అయితే పెళ్లి తర్వాత సాయేషా సినిమాల్లో నటిస్తుందా.? అనేది సస్పెన్సే. తెలుగులో ఒక్క సినిమాతోనే మాయమైపోయిన సాయేషా, తమిళంలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇలాంటి తరుణంలో పెళ్లి చేసుకుని సెటిలైపోతుందనుకోవడానికి లేదు. ఇప్పుడు ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. అలాగే సాయేషా కూడా పెళ్లి తర్వాత కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తుందేమో చూడాలిక. ఇదిలా ఉంటే, తాజా అనౌన్స్‌మెంట్‌తో వీరిద్దరి మధ్యా ఏదో ఉందని సర్య్కులేట్‌ అవుతున్న గాసిప్స్‌కి చెక్‌ పడిపోయినట్లే.

 

వయసులో ఆర్య కంటే సాయేషా 17 ఏళ్లు చిన్నది అన్న విషయం తెలిసిందే. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని ఈ జంట మరోసారి ప్రూవ్‌ చేసిందనుకోవాలి. మొత్తానికి వేలంటైన్స్‌డే నాడు ఈ ప్రేమ జంట తమ ప్రేమను పెళ్లి ముడితో మరింత బలంగా మార్చుకోవాలని డిసైడ్‌ అవ్వడం ఫ్యాన్స్‌కి స్వీట్‌ న్యూస్‌. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS