'రన్ రాజా రన్' సినిమాతో క్యూట్ ఎంట్రీ ఇచ్చింది ఉంగరాల జుట్టు ముద్దుగుమ్మ సీరత్ కపూర్. తొలి సినిమాకే హిట్ సొంతం చేసేసుకుంది. తాజాగా సీనియర్ హీరో నాగార్జునతో 'రాజుగారి గది - 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత త్వరగా స్టార్ హీరోతో నటించే ఛాన్స్ దక్కుతుందని సీరత్ అస్సలు ఊహించలేదట. అయితే నాగార్జునతో నటించడం వల్ల తనలోని టాలెంట్స్ అన్నీ బయటికి వచ్చే అవకాశం ఏర్పడిందనీ ఈ ముద్దుగుమ్మ అంటోంది. జస్ట్ హీరోయిన్ ఏమీ కాదండోయ్ ఈ బ్యూటీ. చాలానే టాలెంట్స్ ఉన్నాయి ఈ చిన్నదానిలో. కొరియోగ్రాఫర్, సింగర్..ఎక్స్ట్రా టాలెంట్స్ అన్న మాట. ఈ టాలెంట్స్ తెలుసుకుని డైరెక్టర్ ఓంకార్, హీరో నాగార్జున ఈ ముద్దుగుమ్మని బాగా ఎంకరేజ్ చేశారట. దాంతో 'రాజుగారి గది - 2' సినిమాలో ఓ బిట్ సాంగ్ పాడేసిందట. అలాగే కొరియోగ్రాఫర్ కాబట్టి డాన్స్ ఇరగదీసేస్తుంది. ఇకపోతే తెలుగు భాష అంటే తనకెంతో ఇష్టమంటోంది. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తెలుగు నేర్చుకుంటోందట. త్వరలోనే తెలుగు బాగా నేర్చుకుని తన పాత్రకి డబ్బింగ్ చెప్పేసుకుంటానంటోంది క్యూటీ సీరత్. ఇక గ్లామర్ విషయానికొస్తే, రంగుల ప్రపంచంలో గ్లామర్ అనేది తప్పనిసరి. అయితే శృతిమించని గ్లామర్‌కే తను ఓటేస్తానంటోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే హీటెక్కించే ఫోటోలతో చెలరేగిపోతూనే ఉంటుందీ బ్యూటీ.