ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ హీరోగా కోలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజే ఆ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగులో నాగా చైతన్య, తమన్నా జంటగా వచ్చిన '100 పర్సెంట్ లవ్' సినిమాకి తమిళ రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. టైటిల్ '100 పర్సెంట్ కాదల్'. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట తమన్నానే అనుకున్నారు. కానీ కుదరలేదు. తర్వాత చాలా మంది ముద్దుగుమ్మలను పరిశీలించారు. అయితే ఆ బంపర్ ఛాన్స్ ముద్దుగుమ్మ షాలినీ పాండే కొట్టేసింది. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ నటన మెచ్చి, కోలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వాటిలో ఇదొకటి. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆ క్యారెక్టర్లో షాలినీ అయితే బావుంటుందని భావించారట చిత్ర యూనిట్. చంద్రమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'అర్జున్‌రెడ్డి' సినిమాలో షాలినీ నటనకు ప్రశంసలు దక్కాయి. తొలి సినిమా అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కింది 'అర్జున్‌రెడ్డి'తో షాలినీకి. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు. సుకుమార్‌తో పాటు భువన చంద్రమౌళి నిర్మాతగా పని చేస్తున్నారు. కథా బలం ఉన్న సినిమాలకు సుకుమార్ నిర్మాతగా పని చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే ఈ సినిమాకీ సుకుమార్ హస్తం ఉందంటే, తమిళంలో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు షాలినీ రెడీ అయిపోయినట్లే అనుకోవాలి.