'బుల్‌ రెడ్డి'తో ఆర్‌ఎక్స్‌ పాప ఊపేస్తోంది.!

మరిన్ని వార్తలు

డెబ్యూ మూవీ 'ఆర్‌ఎక్స్‌ 100'తో ఫుల్‌ డోస్‌ గ్లామర్‌ ఒలకబోసేసిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌ ఐటెం గాళ్‌ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ - కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతోన్న 'సీత' సినిమా కోసం ఈ హాట్‌ హాట్‌ ఆర్‌ఎక్స్‌ బ్యూటీ స్పెషల్‌ ఐటెం సాంగేస్కుంది. 'బుల్‌రెడ్డీ..' అంటూ సాగే ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో ఇటీవలే విడుదలైంది. వెరీ లేటెస్ట్‌గా 'బుల్‌ రెడ్డి' వీడియో ప్రోమోని కూడా యూ ట్యూబ్‌లో వదిలారు. ఇంకేముంది. అసలే బోలెడంత క్రేజుంది మన ఆర్‌ఎక్స్‌ పాపకి. 

 

 

ఇక సోలో సాంగ్‌ పర్‌ఫామెన్స్‌. హాట్‌ హాట్‌ సొగసులు. ఘాటు మసాలా విరుపులు అన్నీ వెరసి ఈ వీడియో సాంగ్‌ ఇప్పుడు యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌ అయిపోయింది. రికార్డు స్థాయిలో వ్యూస్‌ పోటెత్తుతున్నాయి ఈ సాంగ్‌కి. సినిమాలో హీరోయిన్‌గా 'సీత' పాత్ర పోషిస్తున్నది చందమామ కాజల్‌ అగర్వాల్‌ అయినా టోటల్‌ సినిమాకి ఈ బుల్‌రెడ్డి సాంగ్‌తో కావల్సినంత హైప్‌ తీసుకొచ్చేసింది పాయల్‌ రాజ్‌పుత్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీగా తెరకెక్కుతోన్న 'సీత'ను క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజ తెరకెక్కిస్తున్నారు. 

 

మనారా చోప్రా ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనుంది. విలక్షణ నటుడు సోనూ సూద్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌లో కాజల్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇంతవరకూ క్యూట్‌ అండ్‌ హాట్‌గా గ్లామర్‌ పాత్రలతోనే అలరించిన కాజల్‌ ఈ సినిమాలో డిఫరెంట్‌ రోల్‌ పోషిస్తోందని టీజర్‌ ద్వారా తెలిసింది. ఈ నెలాఖరులో 'సీత' విడుదలకు సిద్దమవుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS