అందాల భామ పాయల్ రాజ్‌పుత్‌కి రావల్సిన గ్లామర్ పబ్లిసిటీ అంతా రానే వచ్చేసింది ఒకే ఒక్క సినిమాతో. అదే 'ఆర్ ఎక్స్ 100' సినిమా. ఆ సినిమాతో వచ్చిన ఫేమ్‌తో అమ్మడి స్టార్డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మల్ని తమ సినిమాల కోసం హీరోయిన్స్‌గా ఎంచుకోవడమే కాదు, పలు వ్యాపార సంస్థలు తమ తమ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా వాడేస్తుంటారు. అందమైన భామలకు కావాల్సింది కూడా అలాంటి వాడకమే.
తాజాగా పాయల్ రాజ్పుత్ని అలాగే ఓ షూ కంపెనీ బాగా వాడేసింది. అందుకు తగిన పారితోషికం కూడా అందుతుందిలెండి. ఆ బ్రాండెడ్ షూస్‌ని ప్రమోట్ చేసేందుకు ఇదిగో ఈ హాట్ బ్యూటీ ఇలా రెడీ అయ్యింది. స్కై బ్లూ కలర్ అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూమ్‌లో కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని వంగి వంగి మరీ చూపిస్తోంది. అందాల్నే కాదు, తాను వేసుకున్న షూస్ చూడమని. పాయల్ చూపించింది కదా మరి, ఫ్యాన్స్ ఆ షూస్‌ని పిచ్చ పిచ్చగా సేల్ చేసేసి, వాడేస్కోండిక.