రాజశేఖర్ తాజా చిత్రం 'కల్కి' నుండి మరో టీజర్‌ని వదిలారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కదా. ఆయనకో డిఫరెంట్ టేస్ట్ ఉందని డెబ్యూ మూవీ 'అ'తో నిరూపించేసుకున్నాడు. ఇక రెండో సినిమాగా వస్తోన్న 'కల్కి'ని కూడా ఇన్నోవేటివ్‌గానే తెరకెక్కించబోతున్నాడనడానికి ఈ టీజరే ఎగ్జాంపుల్. అనగనగా ఓ ఊరు, ఆ ఊరులో కొందరు వింత మనుషులు.. అర్ధరాత్రి దూరంగా తగలబడిపోతున్న ఓ చెట్టు, లెక్కలేనన్ని శవాలతో నిండిపోయిన ఓ కొలను.. వింత ఆకారాలతో పోరాట దృశ్యాలు.. ఏం జరుగుతుందో తెలియని అగమ్యగోచర పరిస్థితిలో ఊరి జనం.. వారిని కాపాడడానికి వచ్చిన హీరో అవతారమే కల్కి.
ఇంతకీ ఈ కల్కి ఎవరు.? ఎందుకు ఆ ఊరికి వచ్చాడు. అక్కడి పరిస్థితిని ఎలా చక్కబెట్టాడు.? ఇదే 'కల్కి' కథ. మధ్య మధ్యలో వింత మనుషులతో పాటు ఊరి పెద్ద, స్వామీజీ, పోలీస్.. ఇలా మిగిలిన పాత్రలు కూడా కనిపించాయి. మొత్తానికి టీజర్లో ఏం అర్ధం కాకపోయినా ఏదో ఉందనే ఆశక్తి కల్పించాడు. అదే కదా 'అ' డైరెక్టర్ ప్రత్యేకత. అదాశర్మ, స్కార్లెట్ విల్సన్, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, నాజర్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా తదితర తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయిపోయింది. శివానీ శివాత్మిక సమర్పణలో 'కల్కి' రూపొందుతోంది. 'గరుడవేగ' తర్వాత రాజశేఖర్‌కి ఆ స్థాయి విజయం అందించే సినిమా 'కల్కి' అవుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి, సెకండ్ టీజర్‌తో అంచనాలు భారీగానే పెంచేశారు. కానీ సినిమా విడుదలైతే కదా కంటెన్ట్ ఏంటనేది తెలిసేది.