భార్యా భర్తల వార్‌: కొంచెం టఫ్‌ కాంపిటేషనే.!

By iQlikMovies - September 10, 2018 - 18:09 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ఓ వైపు. అక్కినేని కోడలు సమంత నటిస్తున్న 'యూటర్న్‌' చిత్రం మరోవైపు. ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయన్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలూ క్లాష్‌ కాకూడదనీ డేట్‌ మార్చేందుకు ప్రయత్నించారు కానీ, ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు సమంత, చైతూల్లో. అంటే రెండు సినిమాల నిర్మాతలూ విడుదల డేట్‌ విషయంలో రాజీ పడలేదు. 

దాంతో పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్‌ వద్ద తలపడుతున్న సినిమాలుగా ఈ రెండూ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇకపోతే సినిమాల విషయానికి వస్తే రెండూ ఒకదానికొకటి సంబంధం లేని జోనర్లు. పూర్తిగా విభిన్నమైనవి. చైతూ 'శైలజారెడ్డి' పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌ కాగా, సమంత 'యూటర్న్‌' థ్రిల్లర్‌ మూవీ. మారుతి దర్శకత్వం అంటే 'శైలజారెడ్డి' మీద ఓ స్థాయి అంచనాలు ఆల్రెడీ నెలకొన్నాయి. లేటెస్టుగా ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డ్‌ 'యూ/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చింది. ప్రమోషన్స్‌ కూడా జోరు మీదే ఉన్నాయి. 

ఇకపోతే ప్రజెంట్‌ సమంత జోరు చూస్తే 'యూటర్న్‌' ఆషామాషీగా వదిలేయడానికి లేదు. ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్‌ ఆశక్తిని రేకెత్తిస్తోంది. ఆ తర్వాత విడుదలైన 'కర్మ థీమ్‌' సాంగ్‌ సోషల్‌ మీడియాలో ఓ ఊపు ఊపేస్తోంది. కోటి మిలియన్‌ డాలర్ల వ్యూస్‌ సంపాదించింది ఈ వీడియో సాంగ్‌. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద నువ్వా.? నేనా.? అని తలపడడం ఖాయమనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS