అర్జున్ రెడ్డి సినిమాతో ఆర్డీఎక్స్ బాంబులా పేలింది షాలినీ పాండే. ఆ సినిమాలోని వేడి ముద్దులతో కుర్రకారుని, టాలీవుడ్‌లోని యంగ్ హీరోల్నీ తన బుట్టలో వేసేసుకుంది. వరుసగా సినిమాలపై సినిమాలు ఒప్పుకుంటూ సంతకాలు చేసేస్తోంది. 118 సినిమాలో కథానాయికగా నటించిన షాలినీ తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. తాజాగా...షాలినీ మాయలో మరో హీరో పడిపోయాడు. తనే నాగశౌర్య.
నాగశౌర్య కథానాయకుడిగా సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్ రైటింగ్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈనెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కథానాయికగా షాలినీ పాండేని ఎంచుకున్నారని సమాచారం. నాగశౌర్య - అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో కూడా ఓ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఇదే నెలలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది.