శర్వా కూడా వెనక్కి వెళ్లిపోతున్నాడే.!

By iQlikMovies - May 04, 2018 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు హీరోలందరూ పీరియాడిక్‌ చిత్రాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే గతంలో పీరియాడిక్‌ చిత్రాలను తెరకెక్కించాలంటే దర్శక నిర్మాతలు, నటించాలంటే నటీనటులు కొంచెం ఆలోచించేవారు. 

ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సినిమా కాలం వెనక్కి వెళ్లిపోతోంది. పీరియాడిక్‌ చిత్రాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆడియన్స్‌ కూడా బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా ఈ తరహా కాన్సెప్ట్‌లను టచ్‌ చేసే ధైర్యం వచ్చింది 'రంగస్థలం' సినిమాతోనే. 1980ల కాలం నాటి కథనంతో సాగిన ఆ సినిమా సంచలన విజయం అందుకుంది. దాంతో అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు చాలా సినిమాలు స్వాతంత్య్రానికి ముందు పరిస్థితులను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుండడం విశేషం. 

'రంగస్థలం'తో ఈ తరహా సినిమాలకు బోనీ కొడితే, తర్వాత 'మహానటి', 'మెహబూబా' చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ పీరియాడిక్‌ నేపథ్యంలో తెరకెక్కినవే. మే 9న 'మహానటి' ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఆ తర్వాత రేసులో 'మెహబూబా' ఉంది. తాజాగా ఈ లిస్టులోకి యంగ్‌ హీరో శర్వానంద్‌ కూడా చేరిపోయాడు. శర్వానంద్‌ తాజాగా ఓ పీరియాడిక్‌ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 'దండుపాళ్యం' డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. 

ఆల్రెడీ శర్వా చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. శర్వా - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన 'పడి పడి లేచె మనసు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సుధీర్‌ వర్మతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు శర్వానంద్‌. 'హలో' ఫేం కల్యాణి ఈ సినిమాలో శర్వాకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా కథ కూడా 1980ల కాలం నాటి స్థితిగతులనే ప్రతిబింబించనుందట. అందుకే ఆ కాలం నాటి పరిస్థితులను తలపించేలా ఈ సినిమా కోసం ఓ భారీ పోర్ట్‌ సెట్‌ని రూపొందించిందట చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS