శర్వానంద్ - అజయ్ భూపతి కాంబినేషన్ లో `మహా సముద్రం` తెరకెక్కనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం శర్వా చేతిలో రెండు సినిమాలున్నాయిప్పుడు. శ్రీకారంతో పాటు మరో సినిమా చేస్తున్నాడు. ఇవి రెండూ ఈ యేడాది చివరి నాటికి పూర్తవుతాయి.
2021 ప్రధమార్థంలోనే `మహా సముద్రం` పట్టాలెక్కనుంది. విశాఖ పట్నం నేపథ్యంలో సాగే కథ ఇది. మహా అన్నది అమ్మాయి పేరు. కథానాయికగా ఆ పాత్ర చాలా కీలకం. ఓ ప్రముఖ కథానాయిక మహా గా కనిపించబోతోంది. సిద్దార్థ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంటే ఇద్దరు హీరోలూ.. ఓ హీరోయిన్ కథన్నమాట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.