శర్వా 'రణరంగం' ఓకే, బట్‌ '96' సంగతే సస్పెన్స్‌?

మరిన్ని వార్తలు

హీరో శర్వానంద్‌ షూటింగ్‌ గాయపడిన కారణంగా ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. తాజా సమాచారమ్‌ ప్రకారం ఇదేమంత చిన్నపాటి గాయం కాదని తెలుస్తోంది. హైద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆసుపత్రిలో వైద్యులు ఏకంగా 11 గంటల పాటు శ్రమించి, శర్వానంద్‌కి సర్జరీ చేశారట. భుజానికి సంబంధించిన ఎముకల్లో కదలిక రావడంతో ఈ క్రిటికల్‌ సర్జరీ చేయాల్సి వచ్చిందట. శర్వానంద్‌ నటిస్తున్న '96' రీమేక్‌ మూవీ షూటింగ్‌లోనే ఈ అపశృతి చోటు చేసుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న షూటింగ్‌లో భాగంగా స్కై డైవింగ్‌ చేస్తున్న శర్వానంద్‌ ఎత్తైన భవనంపై నుండి కిందికి దూకుతూ, అదుపు తప్పి గాయాల పాలైన సంగతి తెలిసిందే. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నిర్మాణం కూడా అతి త్వరలోనే పూర్తయ్యేది.

 

ఈలోగా దురదృష్టవశాత్తూ శర్వా గాయపడడంతో, ఈ సినిమా అనుకున్న టైంకి విడుదలయ్యే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న '96' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. శర్వాకి జోడీగా సమంత నటిస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు శర్వానంద్‌ నటిస్తున్న మరో చిత్రం 'రణరంగం' ఇటీవలే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. సో శర్వా గాయం ఈ సినిమా విడుదలకు అడ్డంకి కాలేదు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. కళ్యాణీ ప్రియదర్శిన్‌ మరో హీరోయిన్‌గా నటించింది. రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌లో శర్వానంద్‌ కనిపించనున్నాడు ఈ సినిమాలో. ఆగస్ట్‌ 2న 'రణరంగం' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS