స్టార్ హీరోలెవ‌రూ ఖాళీ లేరాయె!

మరిన్ని వార్తలు

సినిమా త‌ర‌వాత సినిమా మొద‌లెట్టేయాల‌ని శేఖ‌ర్ క‌మ్ముల ఎప్పుడూ అనుకోలేదు. అస‌లు అది ఆయ‌న ప‌ద్ధ‌తే కాదు. మూడ్ ని బ‌ట్టి ప‌ని చేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం. సినిమాల్ని ఎప్పుడూ నిదానంగానే తీస్తారు. ఓ సినిమా ప‌ట్టాల‌పై ఉండ‌గా, మ‌రో సినిమా ప్ర‌క‌టించ‌డం ఎప్పుడూ చేయ‌లేదు. అలాంటి శేఖ‌ర్ క‌మ్ముల కూడా రూటు మార్చారు. `ల‌వ్ స్టోరీ` సినిమా విడుద‌ల కాక‌ముందే... అదే నిర్మాత‌తో మ‌రో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈసారి స్టార్ హీరోతో సినిమా చేస్తాన‌ని, క‌థ కూడా రెడీగా ఉంద‌ని హింట్ ఇచ్చేశారు. దాంతో.. శేఖ‌ర్ స్పీడు పెంచిన‌ట్టు అనిపించింది.

 

కానీ వాస్త‌వంగా చూస్తే... శేఖ‌ర్ క‌మ్ముల త‌దుప‌రి సినిమా ప‌ట్టాలెక్క‌డం అంత వీజీ కాదు. దానికి చాలా కార‌ణాలున్నాయి. ముందుగా `ల‌వ్ స్టోరీ` సినిమా షూటింగ్ పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాత ఓ స్టార్ హీరోని వెదికి ప‌ట్టుకోవాలి. `ల‌వ్ స్టోరీ` షూటింగ్ మ‌రో 20 రోజులు వ‌ర‌కూ బాకీ ఉంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో.. ఆ 20 రోజులూ పూర్తి చేయ‌డం గ‌గ‌నంలా మారింది. చైతూ - సాయి ప‌ల్ల‌వి డేట్లు కుద‌రాలి, షూటింగ్‌కి అనుకూల‌మైన వాతావ‌ర‌ణం రావాలి.. వీటికి టైమ్ ప‌డుతుంది.

 

మ‌రోవైపు స్టార్ హీరోలెవ‌రూ ఖాళీ లేరు. అల్లు అర్జున్‌, మ‌హేష్‌, చ‌రణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్‌.. వీళ్లంతా బిజీ బిజీ. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, వ‌రుణ్.. వీళ్లు కూడా ఖాళీగా లేరు. ఒక‌వేళ క‌థ చెప్పి, ఒప్పించినా - వాళ్ల‌తో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేంత వ‌ర‌కూ డౌటే. శేఖ‌ర్ క‌మ్ముల స్పీడందుకున్నా - పాపం ప‌రిస్థితులే ప్ర‌తికూలంగా మారిపోయాయి. టైమ్ బ్యాడ్ అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS