ఫ్యాన్స్‌కి బిస్కెట్టేసిన హాట్‌ బ్యూటీ.!

By Inkmantra - March 13, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'నేనంటే ఇష్టం లేకపోయినా నా ఫోటోలు వెతుకుతున్నారంటే, నా వీడియోలు చూస్తున్నాంరంటే నన్ను అభిమానిస్తున్నట్లే.. ఇష్టం ఉన్నా లేకున్నా సోషల్‌ మీడియాలో నేను ఏం చేసినా చూస్తున్నారంటే లక్షల్లో దానికి వ్యూస్‌ వస్తున్నాయంటే అది నా అదృష్టం. ఇంతమంది నన్ను అమితంగా అభిమానిస్తున్నట్లే..' అని తనకు తానే కితాబిచ్చేసుకుంటూ, ఫాలోవర్స్‌కి క్రీమ్‌ బిస్కెట్లేసేస్తోంది ముద్దుగుమ్మ షెర్లీన్‌ చోప్రా

 

సినిమాల్లో అవకాశాలతో కొందరు క్రేజ్‌ సంపాదించుకుంటుంటే, సోషల్‌ మీడియాని తన హాట్‌ హాట్‌ పిక్స్‌, వీడియోస్‌తో నింపేసి ఈ ముద్దుగుమ్మ క్రేజ్‌ సంపాదించింది. అయితే ఇటీవల ఉమెన్స్‌ డే సందర్భంగా షెర్లీన్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో ఆమెను సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఈ ఏకిపారేయడాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చేసుకుని ఇదిగో ఇలా ఆనందపడుతోందీ ముద్దుగుమ్మ. 

 

న్యూడ్‌ షోస్‌ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే షెర్లీన్‌ చోప్రా, ఉమెన్స్‌డే సందర్భంగా పోస్ట్‌ చేసిన హాట్‌ వీడియో యావత్‌ భారతనారీమణులు సిగ్గుపడేలా ఉందంటూ నెటిజన్స్‌ తెగ గుస్సా అవుతూ షెర్లీన్‌ని నెగిటివ్‌ కామెంట్స్‌తో గుమ్మెత్తిపోస్తున్నారు. ఈ కామెంట్స్‌కి కాస్త జాగ్రత్త పడిన షెర్లీన్‌ చోప్రా ప్లేటు మార్చేసి, ఇలా నెటిజన్స్‌ని ఐస్‌ చేసేసే ప్రయత్నం చేస్తోంది. మరి షెర్లీన్‌ బిస్కెట్స్‌కి నెటిజన్స్‌ పడిపోతారా.? ఆమె పూసిన ఐస్‌కి కూల్‌ అయిపోయి, కామెంట్స్‌కి చెక్‌ పెట్టేస్తారా.? చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS