రష్మికా కల నెరవేరిందిలా.!

మరిన్ని వార్తలు

'కిర్రాక్‌ పార్టీ'తో కన్నడ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసిన ముద్దుగుమ్మ రష్మికా మండన్నా 'ఛలో' సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసింది. తొలి సినిమాకే సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసి తెలుగు ఆడియన్స్‌నీ మెస్మరైజ్‌ చేసింది. రెండో సినిమా 'గీత గోవిందం'తో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌ అయిపోయింది. 

 

ప్రస్తుతం తెలుగులో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తున్న రష్మికా త్వరలో తమిళ ప్రేక్షకుల్నీ అలరించనుంది. తమిళ హీరో కార్తీ సినిమాలో రష్మికా ఎంపికైందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నేడు లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. గతంలో తమిళ అగ్రహీరో విజయ్‌ సినిమాతో రష్మికా కోలీవుడ్‌ ఎంట్రీ ఉండబోతోందని ప్రచారం జరిగింది. కానీ కుదరలేదు. ఎట్టకేలకు కార్తీతో తన కల నెరవేరింది రష్మికాకి.

 

'తెలుగు, కన్నడ అభిమానుల నుండి నాకు బోలెడంత మద్దతు లభిస్తోంది. అదే మద్దతు కన్నడ అభిమానుల నుండి కూడా లభించాలని ఆశిస్తున్నా..' అంటూ ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది రష్మికా. తమిళంలో ఇంతవరకూ నటించకపోయినా, ఆల్రెడీ రష్మికాకు అక్కడ కూడా బోలెడంత మంది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదంతా సోషల్‌ మీడియా పుణ్యమే. సోషల్‌ మీడియాలో రష్మికా హైపర్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఫాలోవర్స్‌ కూడా అంతే యాక్టివ్‌ మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS