టాలీవుడ్‌లో ఇప్పుడు మరో దుమారం రేగబోతోందా..? ఓ నిర్మాతని టార్గెట్ చేస్తూ - ఆ నిర్మాతని వీధిలోకి లాగడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనని మోసం చేశాడంటూ ఓ మహిళ రోడ్డెక్కింది. సునీత అనే జూనియర్ ఆర్టిస్టు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ధర్నాకి దిగింది. గొలుసులతో తనని తాను బంధించుకుని, మంగళవారం రాత్రంతా వినూత్నమైన నిరసన తెలిపింది.
జనసేన పార్టీ కోసం తాను కష్టపడ్డానని, ఆ సమయంలో బన్నీ వాసు పరిచయం అయ్యారని, సినిమా అవకాశాలు ఇస్తానని మాటిచ్చారని, ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఈ విషయంలో అల్లు అరవింద్ స్పందించాలంటూ సునీత గళం విప్పింది. విషయం తెలుసుకున్న బంజారా హిల్స్ పోలీసులు సునీతని అదుపులోకి తీసుకున్నారు. సునీత ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు స్వీకరిస్తారా? బన్నీ వాసుని స్టేషన్‌కి పిలిపిస్తారా? అనే చర్చ సాగుతోంది.