ప్రస్తుతం విడాకుల సీజన్ నడుస్తోందేమో..? టాలీవుడ్ లో నాగచైతన్య - సమంత వైవాహిక సంబంధంపై ఎన్నో రూమర్లు. బాలీవుడ్ లో శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా విషయంలోనూ ఇదే జరుగుతోంది. నీలి చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడం, శిల్పా శెట్టి పరువు గంగపాలు కావడం తెలిసిన విషయాలే. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా విబేధాలు వచ్చాయని, వీరిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని వార్తలొచ్చాయి. దానికి తోడు గతంలో శిల్పా శెట్టి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. `సింగిల్ మదర్ గా ఉండడానికి నాకెలాంటి భయం లేదు. ఆ శక్తి నాకు ఉంది` అంటూ మాట్లాడింది. దాంతో శిల్ప తన భర్తతో విడిపోతోందన్న పుకార్లకు ఊతం అందినట్టైంది.
అయితే ఇప్పుడు శిల్ప తన మనసులోని మాట స్ట్రాంగ్ గా చెప్పింది. తన భర్తతో విడిపోవడం లేదని స్పష్టం చేసింది. ``ఇటీవల కొన్ని చేదు ఘటనలు జరిగాయి. అయితే అవి మా మధ్య బంధాన్ని మరింత శక్తిమంతం చేశాయి. నేను సినిమాల్లో బిజీ అవుతున్నా. దానికి కారణం.. ఈ చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవడానికే`` అని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ శిల్ప - రాజ్ కుంద్రా ఒకే ఇంట్లో ఉంటున్నారు. సో... ఈ విడాకులు ఉత్తిమాటే అన్నమాట.