యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో చేయనున్నాడు అన్న విషయం విదితమే.
అయితే గత కొన్నిరోజులుగా ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అందరు తారక్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళనని పటాపంచలు చేస్తూ, ఈ సినిమాకి సంబంధించి కొంత కీలక సమాచారం బయటకి వచ్చింది.
అదేమనగా- ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అందులో ఒకరు పూజా హెగ్డే మరొకరు శ్రద్ధా కపూర్. అలాగే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందివ్వనున్నాడు. అయితే ముందుగా అనుకున్నట్టుగా అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం ఇవ్వడంలేదు అన్నది తాజా సమాచారం.
నిన్ననే తారక్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ త్వరలోనే ఎన్టీఆర్ కొత్త లుక్ మీకు చూపిస్తాము అని హామీ ఇచ్చాడు.