టాలీవుడ్ ప్రముఖలందిరపైనా అసభ్యకరమైన ఆరోపణలు చేసినట్లే నేచురల్ స్టార్ నానిపై కూడా జుగుప్సాకరమైన ఆరోపణలు చేసింది అప్పట్లో శ్రీరెడ్డి. ఎన్ని చేసినా ఈమెని పట్టించుకోలేదులెండి అది వేరే విషయం. వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూనే ఉంది రిలాక్స్ అవ్వకుండా శ్రీరెడ్డి. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి నానిపై విరుచుకుపడింది ఈ కాంట్రవర్సీ నటి. నరమే లేని తన నాలుకతో బూతుల పంచాంగం విప్పేసింది.
నాని 'జెర్సీ' సినిమా చూడొద్దనీ, ఈ సినిమాని ఫ్లాప్ చేయాలనీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పిలుపునిస్తోంది. బూతుల్లో ఎన్ని రకాలున్నాయో ఈవిడగారికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. నానిని బూతులు తిడుతూ వీరంగం సృష్టించింది. అయినా శ్రీరెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే, ఈ మధ్య ఈ సోషల్ మీడియా బూత్ ఐటెం, జ్యోతిష్కురాలిగా మారిన సంగతి కూడా తెలిసిందే.
తాను ఎంచుకున్న టాపిక్‌పై జోస్యం చెబుతోంది. అయితే ఈమె జోస్యానికి ఓ స్పెషాలిటీ ఉందండోయ్. ఈమె ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా జరుగుతుంటుంది అంతా. మొన్న మా ఎలక్షన్స్‌లో శివాజీ రాజా గెలుస్తాడని జోస్యం చెప్పింది. కానీ ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు జనసేన ఓడిపోతుందని చెబుతోంది. ఈమె జోస్యం మళ్లీ ఫలించి జనసేన భారీ మెజార్టీతో గెలిచేస్తుందేమో చూడాలిమరి.