వెంకటేష్, నాగచైతన్య కలసి `వెంకీ మామ`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలకమైన మార్పు చోటు చేసుకుంది. వెంకటేష్ పక్కన కథానాయికగా ముందు శ్రియని అనుకున్నారు. చైతూ కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంచుకున్నారు. ఇప్పుడు వెంకీ నాయిక మారిపోయింది. శ్రియని పక్కన పెట్టి పాయల్ రాజ్‌పుత్ ని ఎంచుకున్నారని సమాచారం.
'ఆర్.ఎక్స్ 100'తో కుర్రకారు గుండెల్లోకి దూసుకొచ్చింది ఈ భామ. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో వరుసగా అవకాశాలు అందుతున్నాయి. పాయల్‌కి ఉన్న క్రేజ్ చూసే.. శ్రియని తప్పించినట్టు సమాచారం అందుతోంది. ఈనెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. త్వరలోనే ఈ మార్పుకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.