ప్రేమ - పెళ్లి.. శృతిహాసన్‌ నయా ఫిలాసఫీ.!

మరిన్ని వార్తలు

సినిమాల్లో హీరోయిన్‌గా సీను లేకపోయేసరికి శృతిహాసన్‌కి ఈ మధ్య కాస్త పబ్లిసిటీ గుర్తొచ్చినట్లుంది. ఎలాగోలా వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో 'కాటమరాయుడు' సినిమా తర్వాత శృతిహాసన్‌ని పూర్తిగా మర్చిపోయారు సినీ జనం. ప్రేక్షకులు కూడా. అయితే శృతిహాసన్‌ కూడా దీన్ని లైట్‌గానే తీసుకుందిన్నాళ్లూ. సినిమాతో పాటు, మ్యూజిక్‌ తదితర వ్యాపకాలుండడంతో శృతిహాసన్‌కి అది పెద్ద లోటుగా అనిపించలేదు. 

 

ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ రూపొందించడంలో శృతిహాసన్‌ బిజీగా కాలం గడుపుతోంది. దాంతో పాటు కొన్ని టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఈ మధ్యనే శృతి మళ్లీ యాక్టింగ్‌పై ఫోకస్‌ పెట్టిందట అనే వార్తలు గుప్పుమంటున్నాయి. దాంతో పబ్లిసిటీ స్టంట్‌ స్టార్ట్‌ చేసింది శృతిహాసన్‌. అందులో భాగంగా ప్రేమ గురించి కొన్ని ఫలాసఫీ పదాలను విన్నవించింది. శృతిహాసన్‌ లండన్‌ కుర్రోడు మైఖేల్‌ కోర్సేల్‌తో గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఆ మధ్య శృతి, మైఖేల్‌ని పెళ్లి చేసుకోబోతోందట అనే ప్రచారం కూడా జరిగింది. మైఖేల్‌తో కలిసి, పార్టీలకు, ఇంటి ఫంక్షన్స్‌కీ హాజరైంది కూడా. అయితే ఇప్పుడు మాట మార్చేసింది. ప్రేమిస్తే, పెళ్లి చేసుకోవాలన్న రూలేమైనా ఉందా.? అని తిరుగు ప్రశ్న వేస్తోంది. అంటే ఇప్పట్లో శృతికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిసిపోయింది. కెరీర్‌పై దృష్టి పెట్టాలనే బలమైన ఆలోచనతో ఉందని అర్ధమవుతోంది. అంటే శృతిహాసన్‌ని త్వరలోనే తెరపై చూడగలమన్న నమ్మకం రెట్టింపైంది. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS