మిల్కీ బ్యూటీ బిజీ బిజీ.!

మరిన్ని వార్తలు

'ఎఫ్‌ 2' సినిమాలో బికినీ గ్లామర్‌లో కనిపించి కుర్రాళ్లకు కొత్త కిక్కిచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నాకి ఆఫర్లు పోటెత్తుతున్నాయి. ఆల్రెడీ తమన్నా నుండి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలూ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే కావడం విశేషం. బాలీవుడ్‌ క్వీన్‌కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'దటీజ్‌ మహాలక్ష్మీ' ఒకటి కాగా, హారర్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందుతోన్న 'అభినేత్రి 2' ఇంకోటి. 

 

తాజాగా తమన్నా ఖాతాలో మరో హారర్‌ ఫిల్మ్‌ జాయిన్‌ అయ్యింది. అదే 'రాజుగారి గది 3'. టీవీ యాంకర్‌ ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజుగారి గది' రెండు సీక్వెల్స్‌ మంచి విజయం అందుకున్నాయి. కొత్త నటీనటులతో మొదటి సీక్వెల్‌ని రూపొందించిన ఓంకార్‌, రెండో సీక్వెల్‌కి నాగార్జున, సమంత వంటి స్టార్స్‌తో కొత్త గ్లామర్‌ అద్దాడు. ఇక మూడో సినిమాని పూర్తిగా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీగా రూపొందించాలనుకుంటున్నాడట. 

 

అందుకోసం మిల్కీబ్యూటీని సంప్రదించాడట. హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ కావడం, కథలో బలం ఉండడంతో తమన్నా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందట. అందులోనూ 'అభినేత్రి'తో తమన్నాకి ఈ జోనర్‌ అచ్చొచ్చిందనే చెప్పాలి. సో తమన్నా దాదాపు ఈ సినిమాకి ఓకే అయ్యిందనీ తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుందట 'రాజుగారి గది 3'. ఈ లోగా తమన్నా 'సైరా'తో కలిపి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS